Lalit Modi | లండన్ : ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్‌మోదీ మళ్లీ ప్రేమల్లో పడ్డాడు. లేటు వయసులో గాటు ప్రేమ అన్నట్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన కొత్త ప్రేమాయణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సుస్మితాసేన్‌కు బ్రేకప్ చేబుతూ కొత్త ప్రేయసితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తమ 25 ఏండ్ల స్నేహం ప్రేమగా మారిందంటూ రాసుకొచ్చిన మోదీ కొత్త ప్రేయసి పేరు మాత్రం వెల్లడించలేదు. 1991లో తొలిసారి మినాల్ మోదీని పెండ్లి చేసుకున్న లలిత్..2018లో ఆమె కన్నుమూయడంతో 2022 నుంచి సుస్మితాసేన్‌తో ప్రేమలో ఉన్నాడు. అయితే ఇటీవల సుస్మితాతో ఉన్న ఫొటోలను తన సోషల్‌మీడియా నుంచి తొలిగించిన 61 ఏండ్ల మోదీ కొత్త ప్రేమకు శ్రీకారం చుట్టాడు.