Japan Open 2023 | టోక్యో: భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ లక్ష్యసేన్, ప్రణయ్‌తో పాటు డబుల్స్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జపాన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ సిరీస్-750 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గురువారం లక్ష్యసేన్ 21-14, 21-16తో కెంటా సునెయామా (జపాన్)పై విజయం సాధించాడు.
మరో మ్యాచ్‌లో 19-21, 21-9, 21-9తో భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌పై గెలుపొందాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ 21-17, 21-11తో లస్సె మల్హెడె-జెప్పీ బై (డెన్మార్క్) ద్వయంపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మహిళల డబుల్స్‌లో తీవ్రంగా పోరాడిన గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది.