Kumamoto Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న లక్ష్యసేన్(Lakshya Sen) జపాన్‌లో తనఫామ్ చూపిస్తున్నాడు. కుమమొటో మాస్టర్స్ (Kumamoto Masters )లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో అతడు సింగపూర్ షట్లర్ జియా హెంగ్ జాసన్‌ను చిత్తు చేశాడు. మరో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) కథ రెండో రౌండ్లోనే ముగిసింది. వరుస సెట్లలో విఫలమైన అతడు చేతిలో కంగుతిన్నాడు. క్వార్టర్స్‌లో అడుగుపెట్టడం ద్వారా పురుషుల సింగిల్స్‌లో భారత పతకం ఆశలను లక్ష్యసేన్ సజీవంగా ఉంచాడు.
ఏడోసీడ్ అయిన లక్ష్యసేన్ కుమమొటో మాస్టర్స్‌లో తన తడాఖా చూపించాడు. తొలి రౌండ్ నుంచి దుమ్మురేపుతున్న భారత షట్లర్ ప్రీ క్వార్టర్స్‌లో జియా హెంగ్ జాసన్( సింగపూర్)ను మట్టికరిపించాడు. 39 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్ధికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు సేన్. తొలి సెట్‌ను 21-13తో అలవోకగా గెలుచుకున్న అతడు.. రెండో సెట్‌ను సైతం 21-11తో సొంతం చేసుకున్నాడు. సెమీస్ బెర్తు కోసం 2021 వరల్డ్ ఛాంపియన్ లేహ్ కీన్ యెవ్తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.
LAKSHYA SEN REACHES QF AT JAPAN MASTERS 2025 🏸
Convincing victory for 7th seed 🇮🇳 Lakshya Sen in R16 of Kumamoto Japan Masters event as he defeated 🇸🇬Jia Heng Jason Toh in straight games 21-13,21-11 to reach QF !
QF vs winner of 🇸🇬Loh/🇯🇵Shogo pic.twitter.com/Mn3Y41iIbT
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) November 13, 2025
మరోవైపు ప్రణయ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి రౌండ్లో పర్వలేదనిపించిన అతడు ఈసారి డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కే (Rasmus Gemke) ధాటికి చేతులెత్తేశాడు. రెండు సెట్లలో వెనకబడిన ప్రణయ్ చివరకు 18021, 15-21తో ఓటమి పాలయ్యాడు.