బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ అయిన లక్ష్యసేన్.. 13-21, 21-17, 21-15తో సులి యాంగ్ (చైనీస్ తైఫీ)ను మట్టి కరిపించాడు.
రెండో రౌండ్లో లక్ష్యసేన్.. ఇండోనేషియా మూడో సీడ్ ఆటగాడు జొనాథన్ క్రిస్టీతో తలపడాల్సి ఉంది. ఇక ప్రణయ్.. 19-21, 16-21తో పోపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాభవం పాలయ్యాడు. 53 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ప్రణయ్ తొలి గేమ్‌లో పోరాడినా రెండో గేమ్‌లో తేలిపోయాడు. మహిళల సింగిల్స్‌లో యువ షట్లర్ మాళవిక బన్సోద్.. 21-13, 10-21, 21-17తో యో జియో మిన్ (సింగపూర్)ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్ కుమార్-ఆద్య వరియత్ జంట కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.