టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌తో పాటు యువ ఆటగాళ్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య.. 16-21, 14-21తో కొకి వతనబె (జపాన్) చేతిలో వరుస గేమ్స్‌లను కోల్పోయి 38 నిమిషాల్లోపే ప్రత్యర్థికి మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు.
మరో మ్యాచ్‌లో ఆయుశ్.. 19-21, 25-23, 15-21తో రెండో సీడ్, మాజీ చాంపియన్ కున్లావత్ వితిద్సరన్ చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి.. 21-16, 16-21, 15-21తో చైనీస్ తైపీ షట్లర్ హువాంగ్ యు-సున్ జోరుకు తలవంచింది.