Indonesia Masters 2024: ఈ ఏడాది ఆరంభం నుంచి మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు తాజాగా ఇండోనేషియా మాస్టర్స్‌లో కూడా నిరాశపరిచారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీలో భాగంగా జకర్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా మాస్టర్స్‌లో భారత యువ షట్లర్లు లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్ల పోరాటం ముగిసింది. బుధవారం కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్, రజావత్‌లు సింగిల్స్ ఈవెంట్స్‌లో వెనుదిరిగారు. భారత్ నుంచి ఈ ఈవెంట్లో మిగిలింది కిరణ్ జార్జ్ ఒక్కడే.
పురుషుల ప్రిక్వార్టర్స్‌లో భాగంగా రజావత్.. 18-21, 14-21 తేడాతో ఎనిమిదో సీడ్ బ్రియాన్ యాంగ్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. లక్ష్యసేన్.. 19-21, 18-21 తేడాతో డెన్మార్క్ ప్లేయర్ ఆండర్స్ అంటోన్సెన్ చేతిలో చిత్తయ్యాడు.
Lakshya Sen loses to former WR 2 & 3-time World Championships medalist Anders Antonsen 19-21, 18-21 in 2nd round of Indonesia Masters.
In the last 8 tournaments, Lakshya had failed to progress beyond 2nd round. #IndonesiaMastersSuper500 pic.twitter.com/0H3PTx6L8u
— India_AllSports (@India_AllSports) January 25, 2024
మరో పోరులో కిరణ్ జార్జ్.. 21-11, 13-21, 21-18 తేడాతో లు గువాంగ్ జు (చైనా)ను ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. క్వార్టర్స్ పోరులో జార్జ్.. వితిద్సరన్ కున్లావత్తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఓపెనింగ్ రౌండ్లో ఫ్రాన్స్‌కు చెందిన పొపొవ్‌ను చిత్తు చేసిన జార్జ్.. ప్రిక్వార్టర్స్‌లో గువాంగ్ను ఓడించాడు. శుక్రవారం మధ్యాహ్నం జార్జ్.. వితిద్సరన్తో పోటీపడనున్నాడు.
Kiran you beauty 😍
Kiran George (WR 36) upsets former World No. 10 Lu Guang Zu of China 21-11, 13-21, 21-18 in 2nd round to advance into QF of Indonesia Masters. #IndonesiaMasters2024 pic.twitter.com/JP7rrBi8dv
— India_AllSports (@India_AllSports) January 25, 2024