బోస్టన్: ఫిఫా వరల్డ్‌కప్ సెమీస్‌లోకి ఫ్రాన్స్ ఎంట్రీ ఇచ్చింది. గురువారం బోస్టన్ స్టేడియంలో మొరాక్కోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్ జట్టు వరల్డ్‌కప్ సెమీస్‌లోకి ఎంట్రీ అయ్యింది. ఫ్రాన్స్ కెప్టెన్ కైలియన్ ఎంబాప్పే, ఓస్మేన్ డెంబీలీ గోల్స్ చేశారు. మంగళవారం డల్లాస్‌లో జరిగే సెమీఫైనల్లో స్పెయిన్ లేదా బెల్జియంతో ఫ్రాన్స్ తలపడనున్నది. టోర్నమెంట్లో టాప్ ఫామ్‌లో ఉన్న ఎంబాప్పే.. మ్యాచ్ 60వ నిమిషంలో గోల్ చేశాడు. వాస్తవానికి తొలి అర్థభాగంలో అతను పెనాల్టీ కిక్ మిస్సయ్యాడు. ఆట 4వ నిమిషంలోనే ఆ ఛాన్సు మిస్సైంది. టోర్నీ గోల్ స్కోరింగ్ రేసులో మెస్సీ తర్వాత ఎంబాప్పే నిలిచారు. 2022లో ఖతార్‌లో జరిగిన సెమీఫైనల్స్ .. ఫ్రాన్స్ జట్టు 2-0 తేడాతోనే మొరాకోపై విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆట 66వ నిమిషంలో ఎంబాప్పే ఇచ్చిన పాస్‌ను డెంబిలీ గోల్ చేశాడు. డెంబిలీ ఈ టోర్నీలో అయిదో గోల్ చేశాడు.
ఫ్రాన్స్ జట్టు 1998, 2018 సంవత్సరాల్లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ గెలుచుకున్నది. అయితే ప్రస్తుతం ఆ జట్టు ఆడుతున్న తీరు.. ఈ యేటి టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తున్నది. ఫ్రాన్స్‌లో ఇటీవల రెండు సార్లు యురోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్నది. జూలై 19వ తేదీన జరిగే ఫైనల్లో ఫ్రాన్స్ విజయం సాధిస్తుందని మాజీ ప్లేయర్లు చెబుతున్నారు. సెమీఫైనల్లో బెర్తు ఖరారు చేసుకున్న ఫ్రాన్స్ ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో మొత్తం 16 గోల్స్ చేసింది. ఈ టోర్నీలో అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసిన జట్టుగా ప్రస్తుతం ఫ్రాన్స్ కొనసాగుతోంది. అయితే 8 గోల్స్‌తో ఎంబాప్పే, మెస్సీ.. గోల్డెన్ బూట్ కోసం పోటీపడుతున్నారు. కానీ ఆ రేసులో ఎంబాప్పే ముందున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎంబాప్పే ఎక్కువ అసిస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్ జట్టులో 5 కన్నా ఎక్కువ గోల్స్ చేసిన ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు.