Asia cup 2023 : అఫ్గనిస్థాన్‌పై ఆతిథ్య శ్రీలంక(Srilanka) బ్యాటర్లు చెలరేగారు. దాంతో, లంక 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(92 : 84బంతుల్లో 6 ఫోర్ల, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా అతను ఓపికగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. టాపార్డర్‌లో ఓపెనర్ ప్రథుమ్ నిస్సంక(41) పరుగులతో రాణించాడు. అయితే.. చివర్లో దునిత్ వెల్లలాగే(33 నాటౌట్), మహీశ్ థీక్షణ(28) ధనాధన్ ఆడడంతో లంక భారీ స్కోర్ చేయగలిగింది. అఫ్గనిస్థాన్ బౌలర్లలో గుల్బదిన్ నబీ(Gulbadin Naib) నాలుగు, రషీద్ ఖాన్(Rashid Khan) రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ దసున్ శనక(Dasun Shanaka) బ్యాటింగ్ తీసుకున్నాడు. అతడి నమ్మకాన్ని నిలబెడతూ ఓపెనర్లు ప్రథుమ్ నిస్సంక(41), దిముత్ కరుణరత్రే(32) తొలి వికెట్‌కు 63 పరుగులతో శుభారంభం ఇచ్చారు. జోరు మీదున్న ఈ ఇద్దరినీ గుల్బదిన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన కుశాల్ మెండిస్ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
What an unfortunate end to a batting effort with practically no errors! Kusal Mendis’ flawless innings of 92 ended abruptly in a bizarre run-out at the non-striker’s end, off a dropped catch. 🤯#AsiaCup2023 #AFGvsSL pic.twitter.com/sipkgxY9Zc
— AsianCricketCouncil (@ACCMedia1) September 5, 2023
చరిత అసలంక(36), ధనంజయ డిసిల్వా(14)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే.. సెంచరీ కొడతాడనుకున్న అతడిని 92 పరుగల వద్ద రషీద్ ఖాన్ రనౌట్ చేశాడు. దాంతో, లంక స్కోర్ మందగించింది. కానీ, టెయిలెండర్లు దునిత్ వెల్లలాగే(33 నాటౌట్), మహీశ్ థీక్షణ(28) బ్యాట్ ఝులిపించి స్కోర్ 290 దాటించారు.