Kuldeep Yadav: 3 ఓవర్లలో 4 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. వీడియో
Kuldeep Yadav: విండీస్ బ్యాటర్లను కుల్దీప్ దెబ్బతీశాడు. తన స్పిన్‌తో చెలరేగిపోయాడు. కేవలం మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కెరీర్లో రెండో బెస్ట్ బౌలింగ్ రికార్డును నమోదు చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వీడియోను చూడండి.
బ్రిడ్జ్‌టౌన్: స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav).. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో తన సత్తా చాటాడు. కేవలం మూడు ఓవర్లలో అతను ఆరు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కేవలం 23 ఓవర్లలో 114 రన్స్ చేసి ఔటైంది. కుల్దీప్ స్పిన్‌కు విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆ స్పిన్‌ను ఎలా ఆడాలో తెలియక వికెట్లను సమర్పించుకున్నారు.
Kuldeep Yadav produced his second best bowling figures during the first #WIvIND ODI 🙌 pic.twitter.com/KNp5ccgKPN
— ICC (@ICC) July 28, 2023
కెప్టెన్ షాయ్ హోప్‌తో పాటు డామినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, జేడన్ సీల్స్ వికెట్లను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. విండీస్ బ్యాటర్లను దెబ్బతీసిన కుల్దీప్ బౌలింగ్ వీడియో ఇదే.
If you blinked, odds are you missed one of #KuldeepYadav's wickets from his spell of 4/6 in just 3 overs 🤯
Keep watching #WIvIND – LIVE & FREE on #JioCinema in 11 languages ✨#SabJawaabMilenge #TeamIndia pic.twitter.com/1BA3jMy5ig
— JioHotstar Reality (@HotstarReality) July 27, 2023
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో అతన్ని ఆరవ బౌలర్‌గా వాడారు. కుల్దీప్ బంతి పట్టిన తర్వాత విండీస్ విలవిలలాడింది. చివరి ఏడు వికెట్లను కేవలం 26 పరుగులకే కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మరో స్పిన్నర్ జడేజా ఈ మ్యాచ్‌లో 37 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇండియా 22.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
From hunting in pairs with the ball to summing up @imVkohli's one-handed grab 🙌
Presenting Bowling Brilliance from Barbados ft. @imjadeja & @imkuldeep18 😎 – By @ameyatilak
Full Interview 🎥🔽 #TeamIndia | #WIvIND https://t.co/ND2EZ2Lbzz pic.twitter.com/lZbTCq5kV1
— BCCI (@BCCI) July 28, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

