IND vs ENG 4th Test : రసవత్తరంగా సాగుతున్న రాంచీ టెస్టు(Ranchi Test)లో టీమిండియా పట్టు బిగిస్తోంది. స్టార్ స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు విజృంభించడంతో ఇంగ్లండ్ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. మరికాసేపట్లో టీ అనగా చైనామన్ కుల్దీప్.. డేంజరస్ జాక్ క్రాలే(60 : 91 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్(4)ను బౌల్డ్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌట్ ప్రమాదంలో పడింది.
ప్రస్తుతం స్టోక్స్ సేన 166 పరుగుల ఆధిక్యంలో ఉంది. జానీ బెయిర్‌స్టో(30 నాటౌట్ : 41 బంతుల్లో 3 ఫోర్లు), బెన్ ఫోక్స్(0) క్రీజులో ఉన్నారు. భారత స్పిన్నర్ల జోరు చూస్తుంటే మిగతా సగం వికెట్లు కూడా ఫటాఫట్ తీసేలా ఉన్నారు. అదే జరిగితే రోహిత్ సేన రాంచీలోనే సిరీస్‌ను పట్టేస్తుంది.
England 5 down!
Wicket No. 2⃣ for Kuldeep Yadav! 🙌 🙌
Ben Stokes gets out.
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/g7DpTc5laL
— BCCI (@BCCI) February 25, 2024
భారత్‌ను 307కే కట్టడి చేసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే.. భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలం చూపిస్తూ… ఓపెనర్ బెన్ డకెట్(10)ను ఔట్ చేసి 350వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే ఓలీ పోప్(0)ను ఎల్బీగా వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
Pumped Up & How! ⚡️ ⚡️
Relive R Ashwin’s double strikes 🔽
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/66dRkAjct2
— BCCI (@BCCI) February 25, 2024
19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకుంటాడనుకున్న తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్(11)ను ఎల్బీగా ఔట్ చేసిన అశ్విన్ ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్ జాక్ క్రాలే(60) బజ్ బాల్ ఆటతో హాఫ్ సెంచరీ బాదాడు. జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్లో 13వ అర్ధ శతకం నమోదు చేశాడు.