firecracker | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కౌశాంబి (Kaushambhi) జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో (firecracker factory) భారీ పేలుడు (explosion) సంభవించింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read..
Mann Ki Baat | లోక్సభ ఎన్నికలు.. మన్ కీ బాత్కు తాత్కాలిక బ్రేక్
Alexei Navalny | గుండెపై ఒకే పంచ్.. కేజీబీ పాత పద్ధతి ద్వారా నావల్నీ హత్య..?