Rakul Preet Singh | అత్తారింట్లో తొలిసారి హల్వా ప్రిపేర్ చేసిన కొత్త పెళ్లికూతురు రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహం అనంతరం రకుల్ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం మెట్టినింట్లో తొలిసారి హల్వా (halwa) తయారు చేసింది.
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈనెల 22న గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం రకుల్ అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం మెట్టినింట్లో తొలిసారి హల్వా (halwa) తయారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రకుల్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘ఇవే గృహిణి లక్షణాలు..’, ‘సూపర్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఉత్తర భారతదేశంలో పెళ్లైన రెండో రోజు కొత్త కోడలు ఇంట్లో స్వీట్ తయారు చేయాల్సి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ‘చౌకా చర్దానా’ (Chauka Chardhana) అని పిలుస్తారు. ఇందులో భాగంగా కొత్త పెళ్లి కూతురు (New bride) తొలిసారి అత్తారింట్లో ఏదో ఓ స్వీట్ తయారు చేయాల్సి ఉంటుంది. హల్వా, ఖీర్ వంటి వంటకాన్ని తయారు చేసి అత్తింటి వారికి రుచి చూపిస్తారు. ఈ సంప్రదాయంలో భాగంగానే రకుల్ సూజీ కా హల్వా తయారు చేసింది.
రకుల్ – జాకీ భగ్నానీ వివాహం ఈ నెల 22వ తేదీన గోవా (Goa)లోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం ఈ జంట పెళ్లి జరిగింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నూతన జంట ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో మేరీ పత్నీ కా రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తోంది. రకుల్ తెలుగులో చివరగా 2021లో వచ్చిన కొండపొలం చిత్రంలో కనిపించింది.
Also Read..
Alexei Navalny | ఎట్టకేలకు నావల్నీ మృతదేహం తల్లికి అప్పగింత.. మరణించిన పది రోజులకు
Indian Journalist | న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం.. భారత జర్నలిస్ట్ మృతి
Sudarshan Setu | సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

