IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్ జాక్ క్రాలే(51 : నాటౌట్ 77 బంతుల్లో 6 ఫోర్లు) బజ్ బాల్ ఆటతో హాఫ్ సెంచరీ బాదాడు. జడేజా బౌలింగ్‌లో సింగిల్ తీసి సుదీర్ఘ ఫార్మాట్లో 13వ అర్ధ శతకం నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతడికిది మూడో ఫిఫ్టీ కావడం విశేషం.
దాంతో, ఇంగ్లండ్ జట్టు ఆధిక్యం 143 పరుగులకు చేరింది. మరో ఎండ్‌లో జానీ బెయిర్‌స్టో(22 నాటౌట్ : 23 బంతుల్లో 3 ఫోర్లు) ధనాధన్ ఆడుతున్నాడు. ఒకదశలో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుత స్కోర్.. 98/3.
Zak Crawley gets his third half-century of the series #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 25, 2024
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఓపెనర్ బెన్ డకెట్(10)ను ఔట్ చేసి 350వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాతి బంతికే ఓలీ పోప్(0)ను ఎల్బీగా వెనక్కి పంపి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ మరుసటి ఓవర్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్(11)ను ఎల్బీగా ఔట్ చేసి ఇంగ్లండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు.