Donald Trump | సొంత ఇలాకాలో నిక్కీ హేలీని ఓడించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకుపోతున్నారు. దక్షిణ కరోలినా (South Carolina) రిపబ్లికన్ ప్రైమరీలో ఘన విజాయం సాధించారు. ట్రంప్ హవా ధాటికి సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి (Nikki Haley) ఓటమి తప్పలేదు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకుపోతున్నారు. దక్షిణ కరోలినా (South Carolina) రిపబ్లికన్ ప్రైమరీలో ఘన విజాయం సాధించారు. ట్రంప్ హవా ధాటికి సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి (Nikki Haley) ఓటమి తప్పలేదు. మాజీ అధ్యక్షుడికి 63 శాతం ఓట్లు రాగా హేలీకి 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన ఇప్పటికే న్యూ హాంప్ షైర్, నెవడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్స్‌లో విజయం సాధించారు.
రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హేలీ గతంలో రెండుసార్లు సౌత్ కరోలినా గవర్నర్‌గా పనిచేశారు. తన కంచుకోటలోనే ఓడిపోవడంతో.. అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనని ప్రచారం జరుగుతున్నది. నిక్కీ హేలీ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తున్నది. అయితే తాను రేసు నుంచి తప్పుకునేది లేదని ఆమె ప్రకటించారు. మార్చి 5న జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

