IND vs PAK : ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వికెట్ల వేటతో పాక్‌ను మానసికంగా దెబ్బతీశారు. యూఏఈపై చెలరేగిన కుల్దీప్ యాదవ్(3-18) తన స్పిన్ మ్యాజిక్‌తో మూడు కీలక వికెట్లు తీసిప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టగా.. అక్షర్ పటేలో ఓ చేయి వేశాడు. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(41) రాణించగా ఆఖర్లో షాహిన్ ఆఫ్రిది(33 నాటౌట్) నాలుగు సిక్సర్లతో రెచ్చిపోయాడు. దాంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది.
టాస్ ఓడి బౌలింగ్‌కు దిగిన భారత జట్టుకు పేసర్లు ఆదిలోనే బ్రేకిచ్చారు. దుబాయ్ స్టేడియంలో దాయాదికి షాకిస్తూ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా పాక్ ఓపెనర్ సయీం ఆయూబ్(0)ను వెనక్కి పంపాడు. తొలి బంతిని వైడ్ వేసిన పాండ్యా.. రెండో బంతిని ఇన్‌స్వింగర్‌గా సంధించాడు. లెగ్ సైడ్ పడిన బాల్‌ను ఆడిన సయీం బుమ్రా చేతికి దొరికాడు. దాంతో.. ఒక్క పరుగుకే వికెట్ కోల్పోయింది పాక్. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ మొహమ్మద్ హ్యారిస్(3) వికెట్ తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(2-18) వరుస ఓవర్లలో ఫఖర్, పాక్ సారథి సల్మాన్ అఘా(3)ను పెవిలియన్ పంపి ప్రత్యర్థి కష్టాలను మరింత పెంచాడు. అనంతరం కుల్దీప్ యాదవ్(3-18) తన మ్యాజిక్ చూపిస్తూ మూడు వికెట్లు తీశాడు.
Innings Break!
Brilliant bowling display by our bowlers as Pakistan is restricted to 127/9 in 20 overs.
Kuldeep Yadav with 3 wickets, Axar Patel and Jasprit Bumrah with 2 apiece.
Scorecard – https://t.co/D7cDABHqaf #AsiaCup2025 pic.twitter.com/xQNHvIqiBs
— BCCI (@BCCI) September 14, 2025
ఓవైపు సహచరులు పెవిలియన్ చేరుతన్నా ఓపెనర్ ఫర్హాన్(41) దూకుడుగా ఆడాడు. అర్ధశతకం దిశగా సాగుతున్న అతడిని ఔట్ చేసిన కుల్దీప్ పాక్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు. 64 కే ఆరు వికెట్లు పడడంతో పాక్ వంద లోపై ఆలౌట్ అవుతుందనిపించింది. కానీ,. డెత్ ఓవర్లలో షాహీన్ ఆఫ్రిది (33 నాటౌట్) దంచేశాడు. అతడికి సహకరిస్తూ బుమ్రా ఓవర్లో సూఫియన్ మకీం(10) వరుసగా రెండు ఫోర్లు బాదడంతో పాక్ స్కోర్ వంద దాటింది. చివరి బంతికి మకీంను బౌల్డ్ చేసి రెండో వికెట్ సాధించాడు. పాండ్యా వేసిన 20వ ఓవర్లో షాహిన్ రెండు సిక్సర్లు బాదగా సల్మాన్ సేన 127రన్స్ చేయగలిగింది.
🔥அதிரடி சரவெடி மாமே.. பேக் டு பேக் விக்கெட் தூக்கிய Kuldeep Yadav 🤩
📺காணுங்கள் #INDvPAK உங்கள் சோனி ஸ்போர்ட்ஸ் நேரலை டிவி சேனல் & சோனி லைவ்#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jPrJOdXElD
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025