IND vs UAE : ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి యూఏఈ జట్టు విలవిలలాడింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4-7) తిప్పేయగా .. మీడియం పేసర్ శివం దూబే (4-3)నిప్పులు చెరగగా ఒక్కరంటే ఒక్కరు కాసేపు కూడా క్రీజులో నిలువలేకపోయారు. ఆదిలోనే బుమ్రా వికెట్ల వేటకు తెరతీయగా.. ఆ తర్వాత కుల్దీప్, దూబేలు పోటాపోటీగా వికెట్లు తీశారు. హైదర్ అలీ(1)ని శాంసన్ క్యాచ్ పట్టడంతో 57 పరుగులకే యూఏఈ ఇన్నింగ్స్ ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసి రన్‌రేటు సాధించనుంది సూర్యకుమార్ సేన.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీమిండియా యూఏఈని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. మొదట ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓపెనర్ అలీషాన్ షరుఫు(22)ను ఔట్ చేసి జట్టుకు తొలి వికెట్ అందించాడు. దూకుడుగా ఆడుతున్న అతడిని యార్కర్ కింగ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో.. 26వద్ద ఆతిథ్య జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కాసేపటికే బంతి అందుకున్న వరుణ్ చక్రవర్తి ముహమ్మద్ జొహైబ్(2)ను డగౌట్ చేర్చాడు.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!
Stunning bowling display from #TeamIndia! 🔥
4⃣ wickets for Kuldeep Yadav
3⃣ wickets for Shivam Dube
1⃣ wicket each for Varun Chakaravarthy, Axar Patel & Jasprit BumrahScorecard ▶️ https://t.co/Bmq1j2LGnG#AsiaCup2025 | #INDvUAE pic.twitter.com/cvs2anfip6
— BCCI (@BCCI) September 10, 2025
ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (4-7), శివం దూబే(4-3)లు మ్యాజిక్ చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ విజృంభణతో… 9వ ఓవర్లో రాహుల్ చోప్రా(3), కెప్టెన్ ముహమ్మద్ వసీం(19), హర్షిత్ కౌశిక్(2)లు వెనుదిరిగారు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అక్షర్ పటేల్(13-1), దూబేలు మరో ఎండ్ నుంచి వికెట్ల వేట సాగించారు. 13వ ఓవర్లో రెండు వికెట్లు తీసిన దూబే ప్రత్యర్థిని ఆలౌట్ అంచున నిలిపాడు. చివరి వికెట్‌గా వచ్చిన హైదర్ అలీ(1)ని కుల్దీప్ ఔట్ చేయగా 57కే యూఈఏ ఇన్నింగ్స్ ముగిసింది.