Kuldee[ Yadav : గువాహటి టెస్టులో రెండో రోజు భారత బౌలర్లు తేలిపోయారు. పిచ్ నుంచి సహకారం లభించకపోవడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను నిలువరించలేకపోయారు. ఫలితంగా ప్రత్యర్ధికి భారీ స్కోర్ చేసే అవకాశమిచ్చారు. ఐదొందలు కొట్టేలా కనిపించిన సఫారీలను 489కే కట్టడి చేసినా విజయంపై మాత్రం ఆశలు లేవు. మార్కో జాన్సెస్(93) వికెట్ తీసి ఆ జట్టు ఇన్నింగ్స్ ముగించిన కుల్దీప్ యాదవ్ (Kuldee[ Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ వికెట్ రోడ్డు మాదిరిగా.. ఫ్లాట్‌గా ఉందని అన్నాడు.
రెండో టెస్టులో అంతో ఇంతో ప్రభావం చూపిన భారత బౌలర్ అంటే కుల్దీప్ యాదవే. పేసర్లు సిరాజ్, బుమ్రా, జడేజా సైతం నిరాశపరిచిన వేళ.. కుల్దీప్ కీలక వికెట్లతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు జోరుకు బ్రేకుల్ వేశాడు. సెంచరీకి చేరువైన జాన్సెన్ను బౌల్డ్ చేసిన చైనామన్ బౌలర్ పిచ్ గురించి ఫిర్యాదు చేయలేదు కానీ.. పరోక్షంగా చెత్త పిచ్ అని చెప్పేశాడు. ‘కోల్‌కతా పిచ్ వేరు.. గువాహటి పిచ్ వేరు. ఈ వికెట్ మరీ ఫ్లాట్‌గా రోడ్డులా ఉంది. టెస్టు మ్యాచ్‌లో ఇలాంటి పిచ్ బౌలర్లకు నిజంగా పెద్ద ఛాలెంజ్.
Personally I felt there was a bit of moisture on the pitch and I got some turn. After that, the wicket became very good to bat on. Today also, I didn’t get any turn: Kuldeep Yadav pic.twitter.com/BtOxUHrzNn
— RevSportz Global (@RevSportzGlobal) November 23, 2025
ఒక బౌలర్‌గా ప్రతిరోజు పైచేయి సాధించాలని అనుకుంటా. కానీ, బ్యాటింగ్‌కు అనువైన వికెట్ ఉన్నప్పుడు.. వికెట్ తీసే మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. శనివారం మేము నియంత్రణతో బౌలింగ్ చేశాం. అయితే.. తెంబా బవుమా, స్టబ్స్ కీలక భాగస్వామ్యంతో మమ్మల్ని ఒత్తిడిలో పడేశారు. మొత్తంగా.. ప్రతిఒక్కరం మా శక్తికొద్ది పోరాడం. అయినా సరే బౌలర్లకు ఏమాత్రం సహకారం లభించలేదు. స్పిన్నర్ల సంగతి సరే కనీసం పేసర్లకు లాభించలేదు. టెస్టు క్రికెట్లో ఇలాంటి సందర్భాలు మామూలే. అందుకే.. ప్రతి మ్యాచ్, వికెట్ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు మార్చాల్సి వస్తుంది. అంతేతప్ప వికెట్ గురించి రచ్చ చేయాల్సిందేమీ లేదు. తదుపరి టెస్టుకైనా బౌలర్లకు అనుకూలమైన పిచ్ ఉంటుందని అనుకుంటున్నా’ అని కుల్దీప్ వెల్లడించాడు.
Marco Jansen and Senuran Muthusamy laid the foundation for South Africa’s massive total, while Kuldeep Yadav finished as India’s leading wicket-taker. 💪🏼#INDvSA #TestCricket #Sportskeeda pic.twitter.com/SzvC4HtcgM
— Sportskeeda (@Sportskeeda) November 23, 2025
గువాహటిలో తొలి రోజే మూడు కీలక (రికెల్టన్, స్టబ్స్, మల్డర్) వికెట్లు తీసిన కుల్దీప్.. రెండో రోజు జాన్సెన్ వికెట్ తీసి సఫారీల తొలి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అనంతరం యశస్వీ జైస్వాల్(7 నాటౌట్), కేఎల్ రాహుల్(2 నాటౌట్)లు అజేయంగా నిలవగా.. ఆట ముగిసే సరికి 9 రన్స్ చేసిన టీమిండియా ఇంకా 480 పరుగులు వెనకే ఉంది.