హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో సూపర్ సెంచరీతో విజృంభించిన నితీశ్‌కుమార్‌రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ ‘ఆసీస్‌పై నితీశ్ వీరోచితమైన ఇన్నింగ్స్.
నీ ప్రదర్శనకు సలామ్ యంగ్‌మ్యాన్. మెల్బోర్న్లో చారిత్రక ఇన్నింగ్స్‌తో కదంతొక్కావు. నితీశ్‌లో నీలో భవిష్యత్ భారత కెప్టెన్‌ను చూస్తున్నాను. దేశానికి గర్వపడే క్రికెటర్‌ను అందించిన ముత్యాలరెడ్డితో పాటు కుటుంబసభ్యులకు అభినందనలు’ అని పేర్కొన్నారు.