హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సొంతం చేసుకున్న తెలంగాణ చెస్ ప్లేయర్ రాజా రిత్విక్‌పై రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘ఫిడే గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన రాజా రిత్విక్‌కు అభినందనలు. గ్రేట్ గోయింగ్ యంగ్‌మ్యాన్’ అని ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి ఇప్పటికే ఇరిగేసి అర్జున్, హర్ష భరత్ కోటి జీఎం హోదా పొందగా.. ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా రిత్విక్ నిలిచాడు.