సిరిసిల్ల టౌన్, జూన్ 15: క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సిరిసిల్ల నుంచి జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికైన 12 మంది కిక్ బాక్సర్లకు ప్రయాణ ఖర్చులు, క్రీడా సామగ్రికి అవసరం అయిన రూ.2.35 లక్షలు అందించారు.
దాంతో మధ్యప్రదేశ్ ఇండోర్లో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటేందుకు సిరిసిల్ల క్రీడాకారులు సిద్ధమయ్యారు. అడిగిన వెంటనే సాయం చేసిన కేటీఆర్కు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్నాల శ్రీనివాస్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.