హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్లాండ్ వేదికగా ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే 21వ ఆసియా బీచ్ వాలీబాల్ టోర్నీలో భారత్ తరఫున నరేశ్, కృష్ణంరాజు బరిలోకి దిగుతున్నారు. జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరి ప్రదర్శనను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారు.