కొలరాడో (యూఎస్ఏ): భారత యువ బాక్సర్ కృష్ణ వర్మ అండర్ -19 వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడితో మెరిసింది. కొలరాడోలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 75 కిలోల విభాగంలో పోటీపడ్డ ఔరంగబాద్ అమ్మాయి కృష్ణ.. 5-0తో సిమన్ లెరిక (జర్మనీ)ను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. ఇదే టోర్నీలో మరో నలుగురు అమ్మాయిలూ వారి విభాగాల్లో రజతాలు నెగ్గారు.
చంచల్ చౌదరి (48 కిలోలు), అంజలి కుమారి సింగ్ (57 కిలోలు), విని (60 కిలోలు), ఆకాంక్ష ఫలస్వల్ (70 కిలోలు) ఫైనల్లో ఓడి సిల్వర్తో సరిపెట్టుకున్నారు పురుషుల 75 కిలోల విభాగంలో రాహుల్ కుందు.. 1-4తో జోసెఫ్ (యూఎస్ఏ) చేతిలో పరాభవం పాలయ్యాడు.