INDW vs PAKW : కొలంబోలో భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు జడుసుకుంటున్నారు. పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్(1-10)లు బెంబేలెత్తిస్తుండడంతో పరుగులు చేయడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ఆరు పరుగులకే ఓపెనర్ మునీబా అలీ(2) రనౌట్ కాగా.. ఆకాసేపటికే సడాఫ్ షమాస్ (6) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అనంతరం.. రేణుకా సింగ్ ఓవర్లో సిద్రా అమిన్ (9 నాటౌట్) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రీచా వదిలేసింది. డైవ్ చేయడంతో బంతి ఆమె మణికట్టుకు తగిలి కింద పడింది. లేదంటే పాక్ మూడో వికెట్ పడేది. పది ఓవర్లకు పాక్ స్కోర్..25-2.
భారత్ నిర్దేశించిన 248 పరుగుల ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. స్లో పిచ్ మీద రన్స్ చేయలేక వికెట్ కాపాడుకోలేక తిప్పలు పడుతున్నారు. ఆరంభం నుంచి ఇబ్బంది పడిన ఓపెనర్ మునీబా ఆలీ(2) అనూహ్యంగా రనౌటయ్యింది. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో చివరి బంతికి అలీ ఎల్బీ కోసం అప్పీల్ చేశారు భారత ప్లేయర్లు. కానీ, అంపైర్ ఇవ్వలేదు.
𝘾𝙖𝙪𝙜𝙝𝙩 & 𝘽𝙤𝙬𝙡𝙚𝙙 ☝️
Persistence rewards Kranti Gaud with her first wicket of the night 👏#TeamIndia with a strong start with the ball 🙌
Updates ▶ https://t.co/9BNvQl3J59#WomenInBlue | #CWC25 pic.twitter.com/R5bWlxNVxT
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
కానీ, దీప్తి శర్మ మెరుపు వేగంతో బంతిని వికెట్లకు గురిచూసి కొట్టింది. అంతే.. మునీబా నిరాశగా పెవిలియన్ చేరింది. రిప్లేలో ఆమె ఎల్బీగా ఔట్ అయినట్టు తేలింది. ఒకవేళ టీమిండియా రివ్యూ తీసుకున్నా సరే తను కచ్చితంగా ఔటయ్యేదే. దాంతో.. ఆమె వికెట్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నాలుగు ఓవర్లలో 6 రన్స్ చేసిన పాక్ ఇన్నింగ్స్ సిద్రా అమిన్ (9) రాకతో కాస్త పుంజుకుంది. ఆమె రెండు బౌండరీలతో జోష్ తెచ్చింది. కానీ, క్రాంతి ఓవర్లో ఆమెకే రిటర్న్ క్యాచ్ ఇచ్చింది షమాస్. దాంతో.. 20కే రెండు వికెట్లు కోల్పోయింది పాక్.