INDW vs NZW : బ్యాటర్ల విధ్వంసంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ వికెట్ల వేట మొదలెట్టింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన తొలి ఓవర్లోనే వికెట్ అందించింది. పెద్ద షాట్ ఆడే తొందరలో కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్(1) బంతిని గాల్లోకి లేపింది. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రతీక రావల్ ఒడుపుగా క్యాచ్ అందుకోగా.. ఒక్క పరుగు వద్దే వైట్ ఫెర్న్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం అమేలియా కేర్ (4 నాటౌట్).. జార్జియా పిమ్మర్(0)లు క్రీజులో ఉన్నారు.
టీమిండియా ఇన్నింగ్స్ తర్వాత మళ్లీ వర్షం పడింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం న్యూజిలాండ్‌కు 44 ఓవర్లలో 325 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనలో రెండో ఓవర్లోనే ప్రత్యర్థికి షాకిస్తూ ఓపెనర్ సుజీ బేట్స్(1)ను వెనక్కి పంపింది క్రాంతి గౌడ్. ఆ తర్వాత రేణుకా సింగ్ ఒకే రన్ ఇవ్వడంతో.. మూడు ఓవర్లలో కివీస్ 5 పరుగులే చేసింది. 3 ఓవర్లకు స్కోర్.. 5-1. ఇంకా ఆ జట్టు విజయానికి 320 రన్స్ కావాలి.
Opening over 🤝 Opening wicket
Kranti Gaud into the act straightaway 😎#TeamIndia with the perfect start 🙌
Updates ▶ https://t.co/AuCzj0X11B#WomenInBlue | #CWC25 | #INDvNZ pic.twitter.com/NWBrUVQSRC
— BCCI Women (@BCCIWomen) October 23, 2025