Team India : వన్డే ప్రపంచకప్ విజేతగా భారత జట్టు తొలి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. స్వదేశంలో శ్రీలంకను వైట్‌వాష్ చేసిన టీమిండియా.. ఫిబ్రవరిలో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇప్పటికే వైట్‌బాల్ సిరీస్‌లకు స్క్వాడ్‌ను ప్రకటించిన సెలెక్టర్లు.. శనివార టెస్టు స్క్వాడ్‌ను వెల్లడించారు. ప్రతిభకు పట్టం కడుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్‌గా 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. వరల్డ్‌కప్‌లో అదిరే ప్రదర్శనకు ప్రోత్సాహకంగా ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్‌లను తొలిసారి సుదీర్ఘ పార్మాట్లోకి తీసుకున్నారు.
విశ్వవిజేతగా నిలిచి చిరకాల కలను సాకారం చేసుకున్న భారత జట్టు ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది. మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం కంగారూ నేలపై అడుగుపెట్టనున్న టీమిండియాకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. వన్డే, టీ20 సిరీస్.. ఏకైక టెస్టులో గెలుపే లక్ష్యంగా సీనియర్లు, జూనియర్లతో మేళవించిన బృందాన్ని ఎంపిక చేశారు. వరల్డ్‌కప్ సెమీస్‌లో.. ఫైనల్లో దుమ్మురేపిన షఫాలీ వర్మ, గాయం నుంచి కోలుకుంటున్న ప్రతీకా రావల్ ఓపెనర్లుగా చోటు దక్కించుకున్నారు.
Here’s a look at #TeamIndia‘s squad for the Only Test against Australia in Perth 🙌#AUSvIND pic.twitter.com/I6mYnV3wdN
— BCCI Women (@BCCIWomen) January 24, 2026
నిరుడు శ్రీలంకపై అరంగేట్రంలోనే అదరగొట్టిన స్పిన్ సంచలనం వైష్ణవీ శర్మ(Vaishnavi Sharma)కు టెస్టు స్క్వాడ్‌లోనూ చోటు దక్కింది. డబ్ల్యూపీఎల్ (WPL 2026) నాలుగో సీజన్లో సంచలన బౌలింగ్‌తో వార్తల్లో నిలుస్తున్న సయాలీ సత్ఘరే సైతం సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికైంది. మిడిలార్డర్ బ్యాటర్లుగా హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్.. ఆల్రౌండర్లుగా స్నేమ్ రానా, దీప్తి శర్మలు కీలకం కానున్నారు. బౌలింగ్ యూనిట్లో రేణుకా సింగ్‌తో కలిసి క్రాంతి గౌడ్, సయాలీ కొత్త బంతిని పంచుకోనున్నారు.టీ20, వన్డే సిరీస్ ముగిశాక మార్చి 6వ తేదీన పెర్త్ మైదానంలో ఏకైక టెస్టు జరుగనుంది.
భారత టెస్టు స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జోత్ కౌర్, రీచా ఘోష్(వికెట్ కీపర్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, స్నేహ్ రానా, క్రాంతి గౌడ్, వైష్ణవీ శర్మ, సయాలీ సత్ఘరే.