IPL 2025 : డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 18వ ఎడిషన్‌లో తేలిపోతోంది. నిరుడు లీగ్ దశ నుంచి వరుస విజయాలతో ఫైనల్ ఆడిన కోల్‌కతా ఆల్‌రౌండ్ షోతో ట్రోఫీని ముద్దాడింది. కానీ, ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు. టాపార్డర్ రాణిస్తున్నా.. మిడిలార్డర్ వైఫల్యంతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకపడింది.
ఈ పరిస్థితుల్లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో కీలక పోరుకు సిద్దమైంది కోల్‌కతా. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్ పేసర్ హర్షిత్ రానా(Harshit Rana) మాట్లాడుతూ గౌతం గంభీర్(Gautam Gambhir)ను మిస్ అవుతున్నట్టు చెప్పాడు. ‘ఈ సీజన్లో మా జట్టు మెంటార్‌గా సేవలందించిన గౌతం గంభీర్‌ను మిస్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో గౌతీ ఉండే ఆ జోషే వేరు. అతడి పాజిటివ్ దృక్ఫథం మాలో కొత్త ఉత్తేజాన్ని నింపేది. అయితే.. వ్యక్తిగతంగా నేను గంభీర్‌ను ఎంతగానో మిస్ అవుతున్నా.
A big battle in the capital 👊
Who will come up trumps in this key clash between 💙 and 💜? #TATAIPL | #DCvKKR | @DelhiCapitals | @KKRiders pic.twitter.com/QekByHyZTN
— IndianPremierLeague (@IPL) April 29, 2025
అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్(Abhishek Nair) తిరిగి రావడంతో మా కోచింగ్ సిబ్బంది మునపటిలా ఉత్సాహంగా మారింది. మళ్లీ మాలో విజయకాంక్ష పెరుగుతోంది’ అని రానా వెల్లడించాడు. ఓవైపు కోల్‌కతా జట్టు విఫలం అవుతున్నా హర్షిత్ మాత్రం పవర్ ప్లేలో నిప్పులు చెరుగుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఈ పేసర్ 9 మ్యాచుల్లో 9.48 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన.. 3-24.
గత సీజన్ విజేతగా కోల్‌కతా భారీ అంచనాలతో 18వ ఎడిషన్‌లో బరిలోకి దిగింది. అయితే.. ఆ జట్టు వ్యూహాలు ఏమాత్రం ఫలించడం లేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్ అజింక్యా రహానే, కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీలు మాత్రమే రాణిస్తున్నారు. 17వ సీజన్లో రెచ్చిపోయి ఆడిన వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్ ఈసారి ఘోరంగా విఫలమవుతున్నారు. ఫినిషర్లుగా పేరొందిన రింకూ, రస్సెల్ కడదాక నిలవలేకపోతున్నారు. దాంతో, గెలవాల్సిన మ్యాచ్‌లోనూ రహానే బృందం వరుసగా వికెట్లు కోల్పోతూ ఓడిపోతున్నది.
Harshit Rana is missing GG’s aura in the KKR camp.#HarshitRana #GautamGambhir #IPL2025 #KKR #Insidesport #CricketTwitter pic.twitter.com/FRh6pL7UYq
— InsideSport (@InsideSportIND) April 29, 2025
ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచుల్లో 3 విజయాలతో సరిపెట్టుకుంది కోల్‌కతా. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ డ్రాగా ముగియడంతో 7 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తదుపరి మ్యాచులన్నింటా రహానే బృందం భారీ రన్‌రేటుతో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీమిండియా పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న గంభీర్ 2012, 2014లో కెప్టెన్‌గా కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలిపాడు. 2024లో మెంటార్‌గా సొంత గూటికి వచ్చిన అతడు జట్టుకు మూడో ట్రోఫీ సాధించి పెట్టాడు.