సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 116 పరుగులు చేయగా అ లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 కోవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపొందింది. దీంతో సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేసింది. మొదట బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 115 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయిన కోల్‌కతా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాట్స్మెన్లు గిల్ 57 పరుగులు చేయగా, రానా 25 పరుగులు, దినేశ్ కార్తిక్ 18, ఇయాన్ మోర్గన్ 2 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్ జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ బ్యాట్స్మెన్లు కోల్‌కతా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చేతులెత్తేశారు. దీంతో జట్టు స్పల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న జేసన్ రాయ్ (10) కూడా అవుటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (26) కాసేపు బౌండరీలతో అలరించాడు. కానీ కాసేపటికే రనౌట్‌గా వెనుతిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ (6) నిరావపరిచాడు. అబ్దుల్ సమద్ (25) నాలుగు సిక్సర్లతో ఊపుమీద కనిపించినా, కాసేపటికే శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాట్స్మెన్లు జేసన్ హోల్డర్ (2), రషీద్ ఖాన్ (8), భువనేశ్వర్ కుమార్ (7), సిద్దార్థ కౌల్ (7) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ జట్టు కేవలం 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో టిమ్ సౌతీ, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా, షకిబ్ అల్ హసన్ ఒక వికెట్ కూల్చాడు.