IPL : ప్రపంచంలోనే మేటి టీ20 బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ (Suraykumar Yadav) భారత కెప్టెన్‌గా హిట్ కొట్టాడు. తొలి సిరీస్‌లోనే సారథిగా ప్రశంసలు అందుకున్నాడు. దాంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీలు సూర్యపై ఓ కన్నువేశాయి. ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఆడుతున్న ఈ మిస్టర్ 360 ప్లేయర్‌ను కొనేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) పావులు కదుపుతోంది.
ఇప్పటికే సూర్యకు కోల్‌కతా యాజమాన్యం భారీ ఆఫర్ ఇచ్చిందని టాక్. 18వ సీజన్లో తమ జట్టుకు కెప్టెన్‌గా ఉండాల్సిందిగా ఈ డాషింగ్ బ్యాటర్‌ను కోల్‌కతా మేనేజ్మెంట్ కోరిందని రెవ్ స్పోర్ట్స్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ తెలిపాడు. ఐపీఎల్లో సంచలనాలకు కేరాఫ్ అయిన సూర్య కోల్‌కతా జట్టుతోనే కెరీర్ ఆరంభించాడు. 2014 నుంచి 2017 వరకూ అతడు ఆ ఫ్రాంచైజీ తరఫున 54 మ్యాచుల్లో 608 రన్స్ కొట్టాడు.
🚨𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐑𝐮𝐦𝐨𝐮𝐫𝐬 🚨👀
KKR management unofficially contacted SKY for KKR captaincy from next year .
( Rohit Juglan from Revzsports)pic.twitter.com/ClEVeuqcb4— KKR Vibe (@KnightsVibe) August 24, 2024
ఆ తర్వాత ముంబై అతడిని సొంతం చేసుకుంది. అయితే.. మిడిల్ ఆర్డర్లో సుడిగాలిలా చెలరేగే సూర్యను దూరం చేసుకొని పెద్ద తప్పు చేశామని 17వ సీజన్లో కోల్‌కతా మెంటర్‌గా ఉన్న గౌతం గంభీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దాంతో, ముంబై ఫ్రాంచైజీ తీరుతో అసంతృప్తిగా ఉన్న సూర్యను సొంత గూటికి రప్పించేందుకు కోల్‌కతా ప్రయత్నిస్తోంది.
సూర్య ఓకే అంటే.. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) స్థానంలో కెప్టెన్‌గా ప్రకటించేందుకు కేకేఆర్ సిద్ధంగా ఉంది. భారత టీ20 కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అదరగొట్టిన సూర్య ఇక టెస్టులపై దృష్టి పెట్టాడు. అందుకని దులీప్ ట్రోఫీలో ఇరదీసేందుకు సూర్య సిద్దమవుతున్నాడు.
ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా దక్కించుకొంది. అంతేకాదు ఐదు టైటిళ్లు కట్టబెట్టిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసి పాండ్యాను పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. దాంతో, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు సూర్య కూడా హార్ట్ బ్రేక్ ఎమోజీని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఎంటీ.. సూర్య భాయ్ కెప్టెన్సీ ఆశించి భంగపడ్డాడా? అని అభిమానులు అనుకున్నారు. అనుకున్నట్టే ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో గ్రూప్‌లు ఏర్పడ్డాయనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మాజీ సారథి రోహిత్‌తో పాటు సూర్య కూడా ముంబైని వీడుతారనే ప్రచారం జోరందుకుంది.