IPL 2026 Auction : ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి వేలంపై నిలిచింది. డిసెంబర్ 16న అబుధాబీలో మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. పంతొమ్మిదో సీజన్ కోసం పది జట్లు 173 మందిని అట్టిపెట్టుకున్నాయి. వీరిలో 49 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ భారీ సంఖ్యలో రీటైన్ చేసుకున్నాయి. కాబట్టి.. వేలంలో 77 మంది మాత్రమే అమ్ముడుపోయే అవకాశముంది.
అబుధాబీలో జరుగబోయే మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు రూ.237.55 కోట్లు ఖర్చు చేయనున్నాయి. వీటిలో కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద అత్యధికంగా రూ. 64.3కోట్లు ఉన్నాయి. వేలంలో పదమూడు మందిని కొనేందుకు కోల్‌కతా కసరత్తు చేస్తోంది. ఇందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉండే అవకాశముంది. రెండో అత్యధిక బడ్జెట్ చెన్నై సూపర్ కింగ్స్ వద్ద ఉంది. సీఎస్కే రూ.43.4 కోట్లతో వేలంలో పాల్గొననుంది. ముంబై ఇండియన్స్ దగ్గర రూ.2.75 కోట్లు ఉన్నాయంతే. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ పర్స్‌లో రూ.11.5 కోట్లు ఉన్నాయి.
The remaining purse for all 10 IPL franchises for the 2026 auction. 💰💥#Cricket #IPL #BCCI #Sportskeeda pic.twitter.com/YqyiFuIx1u
— Sportskeeda (@Sportskeeda) November 15, 2025
కోల్‌కతా నైట్ రైడర్స్ : అట్టిపెట్టుకున్న ప్లేయర్లు – అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, రమన్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రొవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
వదిలేసిన ఆటగాళ్లు – వెంకటేశ్ అయ్యర్, అండ్రూ రస్సెల్, క్వింటన్ డికాక్, అన్రిజ్ నోర్జే, రహ్మనుల్లా గుర్బాజ్, స్పెన్సర్ జాన్సన్.
చెన్నై సూపర్ కింగ్స్ : రీటైన్డ్ ప్లేయర్లు – ఎంఎస్ ధోనీ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, నాథ్ ఎల్లిస్, అన్షుల్ కంబోజ్, ముకేశ్ చౌదరీ, రామక్రిష్ణ, ఘోష్, సంజూ శాంసన్(ట్రేడ్ డీల్), రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
సీఎస్కే వద్దనుకున్న ప్లేయర్లు – డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, షేక్ రషీద్, విజయ్ శంకర్, కమలేశ్ నగర్కోటి, వన్ష్ బేడీ, ఆండ్రూ సిద్ధార్థ్.
లక్నో సూపర్ జెయింట్స్ : రీటైన్డ్ ప్లేయర్లు – రిషభ్ పంత్, మర్క్రమ్, హిమ్మత్, అర్జున్ టెండూల్కర్, షమీ (ట్రేడ్ డీల్), ఆయుశ్ బదొని,మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షాబాద్, అర్షిన్, అవేశ్, సిద్ధార్థ్, దిగ్వేజ్, ప్రిన్స్, మయాంక్ , మొహ్సిన్.
విడుదల చేసిన ప్లేయర్లు – రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ దీప్, షమర్ జోసెఫ్, ఆర్యన్ జుయల్, హంగర్కేకర్, యువరాజ్ చౌదరీ.
We’ve got our core for 2026 🩵
Next stop: The #TATAIPL Auction ⏳ pic.twitter.com/8i0gfdZxVD
— Lucknow Super Giants (@LucknowIPL) November 15, 2025
ఢిల్లీ క్యాపిటల్స్: రీటైన్డ్ ప్లేయర్లు – కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, దుష్మంత్ చమీర, అభిషేక్ పొరెల్, అజయ్ మండల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అశుతోష్ శర్మ, మద్వా తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, నితీశ్ రానా(ట్రేడ్ డీల్), సమీర్ రిజ్వీ, త్రిపురన విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, టి.నటరాజన్.
వదిలేసిన ప్లేయర్లు – ఫాఫ్ డూప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, సెడీకుల్లా అటల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రీటైన్డ్ ప్లేయర్లు – రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్, నువాన్ తుషార, రసిక్ దార్ సలాం, సుయాశ్ శర్మ, అభినందన్ సింగ్.
ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు – మయాంక్ అగర్వాల్, లుంగి ఎంగిడి, లివింగ్‌స్టోన్, స్వస్తిక్ చికర, మోహిత్ రథీ, బ్లెస్సింగ్ ముజరబని, టిమ్ సీఫర్ట్.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Here are the players retained and released by the defending champions, Royal Challengers Bengaluru, ahead of the IPL 2026 auction ❤️🏏
RCB fans, are you happy with this squad? 🤔#RCB #IPL2026 #RajatPatidar #Sportskeeda pic.twitter.com/f2QIlM2sSi
— Sportskeeda (@Sportskeeda) November 15, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ : రీటైన్డ్ ప్లేయర్లు – ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, స్మరణ్, ఇషాన్ కిషన్, నితీశ్ రెడ్డి, క్లాసెన్, హర్ష్ దుబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, ప్యాట్ కమిన్స్, ఉనాద్కాట్, ఇషాన్ మలింగ, జీషన్ అన్సారీ.
వద్దనుకున్న ప్లేయర్లు – ఆడం జంపా, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, వియాన్ మల్డర్, సిమర్జిత్ సింగ్, సచిన్ బేబీ, అధర్వ తైడే.
పంజాబ్ కింగ్స్ : అట్టిపెట్టుకున్నది వీళ్లనే – శ్రేయాస్ అయ్యర్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, స్టోయినిస్, శశాంక్ సింగ్, నేహల్ వధేర, ప్రియాన్ష్ ఆర్య, పైలా అవినాశ్, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సూర్యాన్ష్ శెడ్గే, మిచెల్ ఓవెన్, వైషాక్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్, గ్జావియర్ బార్ట్లెట్, లాకీ ఫెర్గూసన్.
పంజాబ్ వద్దనుకున్న ప్లేయర్లు – గ్లెన్ మ్యాక్స్‌వెల్, అరోన్ హర్డీ, జోష్ ఇంగ్లిస్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే.
ముంబై ఇండియన్స్ : రీటైన్డ్ ప్లేయర్లు – రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మింజ్, రియాన్ రికెల్టన్, హార్దిక్ పాండ్యా, నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, దీపక్ చాహర్, అశ్వినీ కుమార్, రఘు శర్మ, గజన్ఫర్.
ముంబై వదిలేసిన ప్లేయర్లు.. లిజాడ్ విలియమ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, బెవాన్ జాకబ్స్, రీసే టాప్లే, విఘ్నేష్ పుతూర్, సత్యనారాయణ రాజు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Here are the players retained and released by Mumbai Indians ahead of the IPL 2026 auction 💙🏏
MI fans, are you happy with this squad? 🤔#MI #IPL2026 #HardikPandya #Sportskeeda pic.twitter.com/1CkUlKDBqo
— Sportskeeda (@Sportskeeda) November 15, 2025
రాజస్థాన్ రాయల్స్ : అట్టిపెట్టుకున్న ప్లేయర్లు – యశస్వీ జైస్వాల్, షిమ్రన్ హిట్మైర్, వైభవ్ సూర్యవంశీ, డ్రె ప్రిటోరియస్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్(ట్రేడ్ డీల్), ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, యుధ్వీర్ సింగ్, క్వెనా మఫాకా, నంద్రే బర్గర్.
వద్దనుకున్న ప్లేయర్లు – వనిందు హసరంగ, థీక్షణ, ఫజల్హక్ ఫారూఖీ, అశోక్ శర్మ, కునాల్ రాథోర్, కుమార్ కార్తికేయ.
గుజరాత్ టైటాన్స్ : అట్టిపెట్టుకున్న ప్లేయర్లు – శుభ్‌మన్ గిల్, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గుర్నూర్ సింగ్ బ్రార్, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, రబడ, సిరాజ్, కుమార్ కుషగ్ర, మానవ్ సుతార్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, సాయి కిశోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్.
వద్దనుకున్న ప్లేయర్లు – కరిమ్ జనత్, దసున్ శనక, గెరాల్డ్ కొయెట్జీ, మహిపాల్ లొమ్రోర్, కుల్వంత్ ఖెజ్రోలియా.