Chandrakant Pandit : గుజరాత్ టైటన్స్‌పై ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టిన రింకూ సింగ్(Rinku Singh)పై ప్రశంసలు కురుస్తున్నాయి. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో ఈ లెఫ్ట్ హ్యాండర్ అద్భుతం చేశాడు. సంచలన బ్యాటింగ్ చేసి ఒంటి చేత్తో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిత్(Chandrakant Pandit) మాట్లాడుతూ.. తన 43 ఏళ్ల కెరీర్లో ఇలాంటి అద్భుతం చూడలేదని అన్నాడు. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న అతను ఏం చెప్పాడంటే..
1. మీ మొదటి రియాక్షన్?
ఇదొక అద్భుతం. అందులో సందేహం లేదు. రింకూ అలా చెలరేగడం ఒక మిరాకిల్. అయితే.. మేము ఆటగాళ్ల నమ్మకాన్ని, రింకూ ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయలేదు.
Watching this on L➅➅➅➅➅P… and we still can’t believe what we just witnessed! 🤯pic.twitter.com/1tyryjm47W
— KolkataKnightRiders (@KKRiders) April 9, 2023
2. సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకూకు ఏం చెప్తారు?
నేను ఎల్లప్పుడూ రింకూతో నువ్వు నా బెస్ట్ ప్లేయర్ అని అంటుంటాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను.
𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌
Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 – By @Moulinparikh
Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H
— IndianPremierLeague (@IPL) April 10, 2023
3. ఆఖరి ఓవర్ సయమంలో మీ బుర్రలో ఏ ఆలోచనలు తిరిగాయి?
నిజం చెప్తున్నా.. ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తమ జట్టు గెలుస్తుందని ఏ కోచ్ కూడా చెప్పడు. కానీ, టీ20లో ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని మాకు తెలుసు. అందుకని నమ్మకం కోల్పోలేదు. ముఖ్యంగా రింకూ లాంటి ప్లేయర్ క్రీజులో ఉన్నప్పుడు ఓడిపోతామని ఎలా అనుకుంటాం.
4. ఐదు సిక్స్‌లలో మీకు నచ్చింది?
మూడో సిక్సర్. కవర్స్ దిశగా రింకూ కొట్టిన ఆ సిక్స్ చాలా నచ్చింది. ఫుల్ టాస్ బంతిని రింకూ అద్భుతంగా స్టాండ్స్‌లోకి పంపాడు. బౌలర్ తల మీదుగా బాదిన ఆఖరి సిక్సర్ కూడా గొప్పగా అనిపించింది.
This moment 🥺🤌@rinkusingh235 | #GTvKKR | #AmiKKR | #TATAIPL 2023 pic.twitter.com/vdOXMq6ND5
— KolkataKnightRiders (@KKRiders) April 10, 2023
5. జట్టంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంది?
ప్రత్యేకంగా సెలబ్రేషన్ అంటూ ఏం లేదు. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్ తర్వాత అందరం ఒక చోట కూర్చుంటాం. మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతాం. ఇది మా ఫ్రాంచైజీ రొటీన్. కోచ్‌గా మా జట్టు ప్రదర్శనను ఎంతగానో మెచ్చుకుంటాను.
6. థ్రిల్లింగ్ విక్టరీపై ఫ్రాంచైజీ ఎలా స్పందించింది?
మ్యాచ్ సమయంలో మా సీఈఓ వెంకీ మైసూర్ స్టేడియంలోనే ఉన్నాడు. అతను చాలా సంతోషించాడు. ఫ్రాంచైజీ యజమానులు జై మెహతా, జూహీ చావ్లా కిందికి వచ్చి టీమ్ మొత్తాన్ని అభినందించారు. వాళ్ల కళ్లలో ఎంతో సంతోషం కనిపించింది.