Baahubali: The Epic | ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’. ఈ సినిమాను రీసెంట్గా ‘బాహుబలి: ది ఎపిక్’ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఒకే పార్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభంజనం సృష్టించింది. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎపిక్ వెర్షన్లో సూమారు 90 నిమిషాలు తగ్గించారు. అనవసరమైన సాగతీత లేకుండా, కేవలం కథలోని కీలక మలుపులు, యాక్షన్ ఎపిసోడ్స్, మరియు ఎమోషనల్ సీన్స్‌ను మాత్రమే ఉంచి ఈ ఎడిట్‌ను సిద్ధం చేశారు. థియేటర్లలో ఈ వెర్షన్‌కు విశేష స్పందన రావడంతో, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
#Bahubali : The Epic (Hindi)
Now streaming on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/TwSx45HLKt
— OTT Trackers (@OTT_Trackers) December 25, 2025