Virat Kohl : వన్డే ఫార్మాట్లో శతకాలతో హోరెత్తిస్తున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రపంచకప్ బెర్తుకు మరింత చేరువయ్యాడు. వచ్చే ఏడాది జరుగబోయే ఈ టోర్నీయే లక్ష్యంగా చెలరేగిపోతున్న విరాట్.. ఇటీవలే సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించి వరుసగా రెండు శతకాలతో ఔరా అనిపించాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లోనూ వందతో మెరిసి ప్రపంచకప్ సన్నద్ధతలో ‘తగ్గేదేలే’ అని చాటాడు. ఆంధ్రపై అతడి క్లాస్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయ్యాడు చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ (Rajkumar Sharma). తన శిష్యుడి ఫామ్‌పై స్పందించిన శర్మ.. వన్డే ప్రపంచకప్ ఆడేందుకు కోహ్లీ సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ వన్డేల్లో పూనకం వచ్చినట్టు ఆడుతున్నాడు. స్వదేశంలో సఫారీ బౌలర్లను ఉతికేస్తూ రెండు సెంచరీలతో తాను రేసులోనే ఉన్నానని ప్రకటించిన అతడు.. దేశవాళీలోనూ ధమాకా ఇన్నింగ్స్ ఆడాడు. గత ఐదు మ్యాచుల్లో మూడుసార్లు శతక్కొట్టిన విరాట్.. వరల్డ్‌కప్ పోటీలకు సిద్ధంగా ఉన్నాడని అతడి చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు.
#WATCH | Rajkot, Gujarat | On Virat Kohli’s return to the Vijay Hazare Trophy for Delhi and scoring a century against Andhra Pradesh, Virat Kohli’s childhood coach Rajkumar Sharma says, “He is in brilliant form. He batted very well and ensured Delhi’s victory. He played domestic… pic.twitter.com/XXkY1nsaBr
— ANI (@ANI) December 24, 2025
‘కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల ఛేదనలో అతడు గొప్పగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన విరాట్.. ఏమాత్రం తడబడకుండా మూడంకెల స్కోర్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న క్రికెటర్ కోహ్లీనే. ప్రపంచకప్ టోర్నీకి అతడు సిద్దంగా ఉన్నాడు’ అని ఏఎన్ఐతో శర్మ వెల్లడించాడు. కోహ్లీకి (9ఏళ్లు,10 ఏళ్లు) ఢిల్లీ క్రికెట్ అకాడమీలో రెండు సంవత్సరాలు శర్మ కోచింగ్ ఇచ్చాడు.
బీసీసీఐ ఆదేశాల మేరకు దేశవాళీలో ఆడేందుకు అంగీకరించిన కోహ్లీ.. ఆంధ్ర బౌలర్లకు తన క్లాస్ ఆటను చూపించాడు. ఈ ఫార్మాట్లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ 101 బంతుల్లోనే 131 రన్స్ సాధించాడు. 12 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడిన రన్ మెషీన్ ఢిల్లీ విజయంలో కీలమయ్యాడు. అంతేకాదు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16 వేల పరుగుల క్లబ్లో చేరి సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టాడు. సచిన్ 391 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. కోహ్లీ కేవలం 330 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ క్లబ్లో చేరాడు.
Not a coronation. Just confirmation. 👑
5️⃣8️⃣* centuries, 1️⃣6️⃣,0️⃣0️⃣0️⃣* runs and counting for Virat Prem Kohli in List A Cricket. 🙇♂️ pic.twitter.com/D3G2zWBNs2
— Royal Challengers Bengaluru (@RCBTweets) December 24, 2025