సిరీస్‌పై గురి
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచెస్టర్ వన్డే కంటే ముందే సిరీస్ దక్కించుకోవాలని చూస్తున్నది.
- భారత్, ఇంగ్లండ్ రెండో వన్డే నేడు
- కోహ్లీ ఆడేది అనుమానమే
భారత్ మరో సిరీస్‌పై గురిపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నది. ఓవల్ వన్డే విజయమిచ్చిన జోష్‌తో లార్డ్స్‌లో ఇంగ్లండ్ భరతం పట్టాలని చూస్తున్నది. గెలిస్తే గానీ నిలువని పరిస్థితి ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ జట్టుపై మరింత ఒత్తిడి పెంచుతూ జయకేతనం ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్నది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడేది అనుమానంగా మారింది. గురువారం రెండో వన్డే ఆసక్తికరంగా సాగనుంది.
లండన్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత్ దూకుడు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే నిలువరిస్తూ టీమ్ఇండియా విజయాలు సొంతం చేసుకుంటున్నది. ఇదే జోరులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి మాంచెస్టర్ వన్డే కంటే ముందే సిరీస్ దక్కించుకోవాలని చూస్తున్నది. గురువారం జరిగే రెండో వన్డేలో అదరగొట్టాలని రోహిత్‌శర్మ నేతృత్వంలోని టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఇందుకు జట్టు కూర్పు కూడా అనుకూలంగా ఉంది. విరాట్ కోహ్లీ లేకపోయినా..యువ క్రికెటర్లు అవకాశాలను చక్కగా అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్…ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసి తన సత్తాఏంటో చూపెట్టాడు. మిడిలార్డర్లో మరో ముంబైకర్ శ్రేయాస్ అయ్యర్ ఫామ్‌లేమి కొనసాగుతూనే ఉన్నది. పుల్‌షాట్ ఆడటంలో విఫలమవుతున్న అయ్యర్ స్వల్ప స్కోర్లకే వెనుదిరుగుతున్నాడు. కోహ్లీ గాయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్..తుది జట్టులో ఆడేది అనుమానంగా మారింది. రెండో మ్యాచ్‌లో ఏలాంటి మార్పులేకుండానే టీమ్ఇండియా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
పుంజుకోవాలని
ఇంగ్లండ్ పుంజుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ చేజార్చుకున్న బట్లర్ గ్యాంగ్..సొంతగడ్డపై పరువు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తొలి వన్డేలో బుమ్రా బౌలింగ్ ధాటికి బ్యాటింగ్ కకావికలైంది. స్టార్ బ్యాటర్లు రాయ్, రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్ సున్నాలకు పరిమితమయ్యారు. టెస్టుల్లో అదరగొట్టిన బెయిర్‌స్టో, రూట్ కూడా బ్యాట్లు ఝులిపించడంలో విఫలమయ్యారు. గెలిచి సిరీస్‌లో నిలువాలన్న కసితోఉన్న ఇంగ్లండ్ లార్డ్స్ వన్డేకు జట్టులో మార్పులు చేసే అవకాశముంది.
జట్ల అంచనా భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), ధవన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిద్ధ్ క్రిష్ణ, చాహల్
ఇంగ్లండ్: బట్లర్(కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, అలీ, విల్లే, ఓవర్టన్/కర్రాన్, బ్రైడన్ కర్స్, టోప్లె
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

