హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య సన్‌రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌తో ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ గొడవ పటడం, ఆట ముగిసిన తర్వాత అతనితో కరచాలనం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ వరుసగా రెండు ఫోర్లు బాదిన తర్వాత వీరిద్దరి మధ్య మైదానంలో మాటల యుద్ధం నడిచింది. కోహ్లీ ఆగ్రహంతో హెడ్‌కు ఏదో చెబుతుండగా, ఆతిథ్య బ్యాటర్ నవ్వుతోనే కనిపించాడు. అయితే, ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లంతాఆనవాయితీ ప్రకారం షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోగా.. హెడ్‌ను పట్టించుకోకుండా కోహ్లీ ముందుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ లాంటి దిగ్గజ క్రికెటర్ ప్రత్యర్థి ఆటగాడిని అగౌరవపరచడం సరికాదని మాజీ క్రికెటర్లు, అభిమానులు అంటున్నారు.