IPL 2024 RR vs RCB | సిక్సర్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ.. డూప్లెసిస్ ఔట్
IPL 2024 RR vs RCB : జైపూర్ గడ్డపై విరాట్ కోహ్లీ(72) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. తొలి ఓవర్ నుంచి దంచుతున్న విరాట్.. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీ సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది
IPL 2024 RR vs RCB : జైపూర్ గడ్డపై విరాట్ కోహ్లీ(72) తొలి హాఫ్ సెంచరీ బాదాడు. తొలి ఓవర్ నుంచి దంచుతున్న విరాట్.. పరాగ్ ఓవర్లో సిక్సర్ బాది ఫిఫ్టీ సాధించాడు. ఈ సీజన్లో కోహ్లీకి ఇది మూడో అర్ధ శతకం. మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ డూప్లెసస్ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో బట్లర్ చేతికి చిక్కాడు.
అంతకుముందే బౌల్ట్ క్యాచ్ వదిలేయడంతో బతికి పోయిన డూప్లెసిస్ ఆ తర్వాత బంతికే షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. దాంతో, 125 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్… 125/1.
ICYMI – @imVkohli brought a well made half-century with a MAXIMUM 🔥💥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
LIVE – https://t.co/lAXHxeYCjV #TATAIPL #IPL2024 #RRvRCB pic.twitter.com/g03v0YkZvO
— IndianPremierLeague (@IPL) April 6, 2024
టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. బెంగళూరు జట్టు గత మ్యాచ్‌లో విఫలమైన అనుజ్ రావత్ స్థానంలో సౌరవ్ చౌహన్‌ను తీసుకుంది. జోరు మీదున్న రాజస్థాన్ ఏ మార్పులు లేకుండా ఆడుతోంది.
మహిళల జీవితాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో రాజస్థాన్ ఆటగాళ్లు పింక్ జెర్సీ ధరించి ఆడుతున్నారు. పింక్ ప్రామిస్లో భాగంగా.. ఆర్ఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. ఒక్కో సిక్సర్‌కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

