Virat Kohli : వన్డేల్లో రన్ మెషీన్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ (Virat Kohli) తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియా పర్యటనలో మాత్రం నిరాశపరుస్తున్నాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో ‘ఛేజ్ మాస్టర్’గా ఓ వెలుగు వెలిగిన అతడు.. ఇప్పుడు ఖాతా తెరిచేందుకు అపసోపాలు పడుతున్నాడు. పెర్త్, అడిలైడ్‌లో సున్నాకే ఔటైన విరాట్.. వీడ్కోలు వార్తలకు ఆజ్యం పోస్తున్నాడు. అయితే.. వెటరన్ ప్లేయర్ అయిన కోహ్లీ కుదురుకున్నాడంటే దంచేస్తాడని, కాస్త టైమ్ తీసుకుంటే సిడ్నీ వన్డే(Sydney ODI)లో విశ్వరూపం చూపిస్తాడని విశ్లేషకులు అంటున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్న వేళ.. సిడ్నీలో మాత్రం ఈ దిగ్గజ ఆటగాడి రికార్డు ఏమంత ఘనంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆస్ట్రేలియాతో పోటీగా ఆడలేక వరుసగా రెండు ఓటములతో సిరీస్ కోల్పోయిన భారత జట్టు మూడో వన్డేలో విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఎంత ముఖ్యమో.. కోహ్లీకి అంతకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే.. భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన అతడు.. రెండు డక్స్‌తో అందర్నీ విస్తుపోయేలా చేశాడు. అందుకే.. చివరిదైన మూడో వన్డేలో కోహ్లీ తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు.
Virat Kohli vs India
Stoppable on his day.pic.twitter.com/MnMiP8UD0w
— poetvanity (@PoetVanity_) October 24, 2025
కానీ, ఆ మైదానంలో అతడి రికార్డేమీ ఘనంగా లేదు. ఇప్పటివరకూ అక్కడ ఏడు మ్యాచుల్లో మాజీ కెప్టెన్ ఒకేఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అది కూడా ఐదేళ్లక్రితం (89 నాటౌట్). ఈ మైదానంలో మొత్తంగా 24.33 సగటుతో 146 రన్స్ చేశాడంతే. ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే.. మూడో వన్డేలో అతడికి పిచ్ నుంచే కాకుండా కంగారూ పేసర్ల నుంచి కఠిన పరీక్ష ఎదురవ్వనుంది.
THIS PICTURE OF VIRAT KOHLI SAYS MANY THINGS. 😥💔 pic.twitter.com/3HBUq1pN4O
— Tanuj (@ImTanujSingh) October 23, 2025
రెండేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో దంచేసిన విరాట్.. ఆపై టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్‌లోనూ చెలరేగిపోయాడు. పొట్టి క్రికెట్, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. ప్రస్తుతం కొనసాగుతున్న ఫార్మాట్ వన్డే మాత్రమే. రెండేళ్లలో ప్రపంచ కప్ ఉన్నందున జట్టులో చోటు ఆశిస్తున్న విరాట్.. అందివచ్చిన అవకాశాన్ని మాత్రం చేజార్చుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనతో వీరకొట్టుడుతో మునపటి కోహ్లీని తలపిస్తాడని భావించిన ఫ్యాన్స్‌ను ఉసూరుమనిపించాడీ వెటరన్.
Virat Kohli will rise again. pic.twitter.com/kgEZQcghXn
— Team India 🇮🇳 (@FCteamINDIA) October 24, 2025
తొలి వన్డేలో 8 బంతులు ఎదుర్కొని కవర్స్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అడిలైడ్ వన్డేలోనూ నాలుగు బంతులాడినా.. ఎల్బీగా ఔటై నిరాశపరిచాడు. అనంతరం పెవిలియన్ వెళ్తూ.. మొహం చూపించలేక తన గ్లోవ్స్ తీసి ప్రేక్షకులకు చూపించాడు. 50 ఓవర్ల ఆటలో టన్నుల కొద్దీ పరుగులు.. అత్యధిక సెంచరీలతో రికార్డు బ్రేకర్‌గా నిలిచిన విరాట్ చివరిదైన సిడ్నీ వన్డేలో బ్యాట్ ఝులిపించాలని యావత్ క్రీడాలోకం కోరుకుంటోంది.