virat kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(virat kohli) ఒకే సెంచరీతో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఐదొందల అంతర్జాతీయ మ్యాచ్‌లో శతకం సాధించిన అతను దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ 76వ సెంచరీ బాదడం విశేషం. అవును.. సచిన్ 587 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరువయ్యాడు. విరాట్ మాత్రం 559 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. సచిన్ కంటే 28 కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో కింగ్ కోహ్లీ రికార్డు శతకం బాదాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 180 బంతుల్లో 10 ఫోర్లతో కింగ్ కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఐదొందల మ్యాచ్‌లో వంద కొట్టిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అతడి కంటే ముందు సచిన్(664), ఎంఎస్ ధోనీ(538), రాహుల్ ద్రవిడ్(509)లు టీమిండియా తరఫున 500ల మ్యాచ్‌లు ఆడారు. కానీ, వీళ్లలో ఎవరూ కూడా సెంచరీ కొట్టలేకపోయారు.
A magnificent CENTURY by @imVkohli in his landmark game for #TeamIndia 👏👏
This is his 29th 💯 in Test cricket and 76th overall 🫡#WIvIND pic.twitter.com/tFP8QQ0QHH
— BCCI (@BCCI) July 21, 2023
ఫామ్‌లోకి వచ్చాక స్వదేశంలో శతకాల మోత మోగిస్తున్న కోహ్లీ విదేశీ గడ్డపై ఈరోజు వంద కొట్టాడు. దాంతో, ఐదేళ్ల నిరీక్షణకు తెరదించాడు. విరాట్ చివరిసారిగా ఆస్ట్రేలియాపై 2018 డిసెంబర్లో సెంచరీ బాదాడు. పెర్త్ స్టేడియం(Perth Test)లో 123 రన్స్ కొట్టాడు. అదే నెలలో మెల్బోర్న్ స్టేడియంలో ఈ ఛేజ్ మాస్టర్ 82 పరుగులు చేశాడు.
పెర్త్ టెస్టు(2018 )లో సెంచరీ కొట్టిన కోహ్లీ
అప్పటి నుంచి విదేశాల్లో విరాట్ ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. కానీ, వాటిని మూడంకెల స్కోర్‌గా మలచలేకపోయాడు. అయితే.. ఈసారి అందివచ్చిన అవకాశాన్ని అతను వదులుకోలేదు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ రికార్డు శతకం సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది29వ సెంచరీ.