Virat Kohli : ఆసియా కప్(Asia Cup 2023) సూపర్ 4 మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ(122 నాటౌట్ : 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో విజృంభించాడు. అతడికి కేఎల్ రాహుల్(111 నాటౌట్ : 106 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్స్‌లు) తోడవ్వడంతో భారత జట్టు కొండంత స్కోర్ చేసింది. తనకు ఎంతో అచ్చొచ్చిన కొలంబోలో విరాట్ వరుసగా నాలుగు శతకాలు బాదడం విశేషం. అంతేకాదు విధ్వంసక సెంచరీలతో పాక్ బౌలర్లపై విరుచుకు పడిన కోహ్లీ, రాహుల్‌తో కలిసి పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. అవేంటంటే..?
తనకు ఎంతో అచ్చొచ్చిన కొలంబోలోని ప్రేమదాస స్టేడియం(Premadasa Stadium)లో విరాట్ విశ్వరూపం చూపించాడు. వరుసగా నాలుగో శతకం బాదాడు. ఇంతకు ముందు ఇక్కడ కోహ్లీ 122 నాటౌట్, 110 నాటౌట్, 131 రన్స్ సాధించాడు.
పాక్‌పై శతకంతో విరాట్ కోహ్లీ మరో ఫీట్ సాధించాడు. ఆసియా కప్‌లో నాలుగో శతకం నమోదు చేశాడు. దాంతో, ఈ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(4 శతకాలు) రికార్డు సమం చేశాడు. ఈ జాజితాలో లంక దిగ్గజం సనత్ జయసూర్య(Sanath Jayasuriya) 6 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.
13000 ODI runs and counting for 👑 Kohli
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
— BCCI (@BCCI) September 11, 2023
పాక్‌పై విరోచిత సెంచరీతో విరాట్ 13వేల క్లబ్లో చేరాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 13వేల రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 268 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని దాటాడు. దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 321, రికీ పాంటింగ్(Ricky Ponting) 341 ఇన్నింగ్స్‌ల్లో 13 వేల పరుగులు సాధించారు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్
కోహ్లీ, రాహుల్ ఈ మ్యాచ్‌లో ఆసియా కప్‌లోనే అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. పాకిస్థాన్‌పై వీళ్లు మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 223 రన్స్ రాబట్టారు. దాంతో, 2012లో పాక్ బ్యాటర్లు హఫీజ్, జంషేడ్ ఇండియాపై చేసిన 224 రన్స్ రికార్డును బ్రేక్ చేశారు.
Innings Break!
A brilliant opening partnership between @ImRo45 & @ShubmanGill, followed by a stupendous 233* run partnership between @imVkohli & @klrahul as #TeamIndia post a total of 356/2 on the board.
Scorecard – https://t.co/kg7Sh2t5pM… #INDvPAK pic.twitter.com/2eu66WTKqz
— BCCI (@BCCI) September 11, 2023
ఈ మ్యాచ్‌లో 233 రన్స్ జోడించిన కోహ్లీ, రాహుల్ పాకిస్తాన్‌పై అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు. 1996లో సచిన్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ పేరిట ఉన్న 231 పరుగల రికార్డును బద్ధలు కొట్టారు. షార్జా వేదికగా జరిగిన వన్డేలో సచిన్, సిద్ధూ రెండో వికెట్‌కు ఈ రికార్డు సృష్టించారు.