న్యూఢిల్లీ : హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న సోమాలీల్యాండ్ను స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ ఈ నెల 26న గుర్తించింది. దీంతో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ సహా 21 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి.
ఇస్లామిక్ సహకార సంఘం ఐదు అంశాలతో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ నిర్ణయం వల్ల హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించింది.