Team India | పెర్త్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌కు ముందే భారత్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 22 నుంచి మొదలయ్యే టెస్టు కోసం జరుగుతున్న సన్నాహాకాల్లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాయాలపాలయ్యారు. రెండు జట్లుగా విడిపోయి సాగుతున్న మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రాహుల్ మోచేతికి గాయమైంది.
దీంతో తీవ్రతను అంచనా వేసేందుకు రాహుల్‌ను స్కానింగ్‌కు పంపినట్టు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనంగా పేర్కొంది. ఆసీస్‌తో తొలి టెస్టుకు వీరిద్దరు అందుబాటులో ఉంటారా లేదా అన్నది అనుమానంగా మారింది.