టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం రాజుకుంది. పెర్త్ టెస్టు తొలి రోజు ఆటలో సహచరులు నిష్క్రమిస్తున్న వేళ ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన రాహుల్..థర్డ్ అంపైర్ నిర్ణయంతో ఔట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అప్పటి వరకు క్రీజులో కుదురుకున్న రాహుల్..స్టార్క్ బౌలింగ్‌లో బంతిని ఆడబోయాడు. అది కాస్తా నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రిప్లేలో పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్ ఔట్ అంటూ ప్రకటించాడు. అయితే స్నికోమీటర్లో ఎడ్జ్ కనిపిస్తున్నా..బంతి..బ్యాట్‌ను తాకకపోవడం స్పష్టంగా కనిపిస్తున్నది. మ్యాచ్ మలుపుతిప్పిన థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు.