పార్ల్: కెప్టెన్ కేఎల్ రాహుల్ వన్డేల్లో మరో హాఫ్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డేలో జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నాడు. 71 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాంట్లో నాలుగు బౌండరీలు ఉన్నాయి. రాహుల్, పంత్‌లు కుదురుగా ఇన్నింగ్స్ ఆడుతున్నారు. పంత్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ మూడు వికెట్‌కు ఇప్పటికే భాగస్వామ్యాన్ని వంద రన్స్ దాటించారు. కానీ ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ చాలా లక్కీ. ఇప్పటికే రెండు సార్లు క్యాచ్ డ్రాప్ అయ్యింది. ఓ సారి రన్నౌట్ ఛాన్స్ కూడా మిస్సైంది. కెప్టెన్‌గా రాహుల్‌కు తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. 30 ఓవర్లు ముగిసే లోగా ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది.