Mohammed Shami | మహమ్మద్ షమీ అరుదైన ఘనత.. ఇషాన్ కిషన్ కామెంట్స్ వైరల్
Mohammed Shami | భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన క్రికెట్ కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగనున్న షమీ.. ఈ మ్యాచ్‌తో తన 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ పూర్తి చేయనున్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) షమీని ఘనంగా సత్కరించింది.
Mohammed Shami | భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన క్రికెట్ కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగనున్న షమీ.. ఈ మ్యాచ్‌తో తన 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ పూర్తి చేయనున్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) షమీని ఘనంగా సత్కరించింది.చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం దులీప్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శనివారం షమీని CAB తరఫున ప్రత్యేకంగా సన్మానించారు.CAB అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతకం చేసిన ప్రత్యేక ‘నెం.100 బెంగాల్ జెర్సీని’ CAB కోశాధికారి సంజయ్ దాస్ షమీకి అందించారు. దీంతో పాటు గంగూలీ సంతకం చేసిన ప్రత్యేక బంతి, వెండి ఫలకాన్ని కూడా బహూకరించారు.
100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ మైలురాయిని పురస్కరించుకుని షమీ కేక్ కట్ చేశాడు. ఈస్ట్ జోన్ జట్టు సహచరులు సంతకం చేసిన మరో ప్రత్యేక జెర్సీని కూడా అతడికి అందించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, ముఖేశ్ కుమార్ తదితరులు షమీతో కలిసి ఫొటోలు దిగారు. ఈస్ట్ జోన్ జట్టు సభ్యులకు సౌరవ్ గంగూలీ తరఫున స్వీట్ల పెట్టెలను కూడా అందించారు. ఫైనల్లో కేవలం పాల్గొనడమే లక్ష్యంగా కాకుండా ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఆడాలని గంగూలీ సూచించినట్లు తెలుస్తోంది. దూకుడైన ఆటతీరుతో పాటు జట్టు సభ్యులంతా ఒకరి కోసం ఒకరు ఆడాలని ఆయన సందేశం ఇచ్చారు. దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుని ఈస్ట్ జోన్‌కు గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఫైనల్‌కు ముందు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షమీపై ప్రశంసలు కురిపించాడు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, షమీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. జట్టులో షమీ ఉండటం తమకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని ఇషాన్ తెలిపాడు. షమీలో కనిపిస్తున్న తీవ్రత, శక్తి గతంతో పోలిస్తే మరింత భిన్నంగా ఉన్నాయని అన్నాడు. ముఖ్యంగా కీలక సమయాల్లో వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న బౌలర్ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని ఇషాన్ చెప్పాడు. షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్ తమకు బలాన్ని ఇస్తున్నాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ప్రణాళికల్లో షమీకి చోటు లేకపోయినప్పటికీ.. దేశవాళీ క్రికెట్లో అతడు తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇషాన్ కిషన్ తెలిపాడు. తిరిగి భారత జట్టులోకి రావాలనే తపన షమీలో స్పష్టంగా కనిపిస్తోందని ఇషాన్ పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో ఆడుతున్నప్పుడు వివిధ మ్యాచ్ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలి, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే విషయాల్లో షమీ విలువైన సూచనలు ఇస్తున్నాడని వెల్లడించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

