KL Rahul : రెండు రోజుల్లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మొదలు కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్ జట్లు నెట్ ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్నాయి. కీలకమైన ఆటగాళ్లను కట్టడి చేసేందేకు వ్యూహాలు రచిస్తున్నాయి. నాగ్‌పూర్ టెస్టుకు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందించాడు. ‘నిజం చెప్పాలంటే మేము ఎలాంటి ప్రణాళికలు రచించలేదు.
ఇది టెస్టు, ఇది వన్డే కాబట్టి ఇలా ఆడాలి? అలా ఆడాలి? అని ఆలోచించం. ఒక్కో బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయి అని రాహుల్ తెలిపాడు. అయితే.. పరిస్థితులను బట్టి కొన్ని షాట్లు ఆడాల్సి రావొచ్చు. మేము పరిస్థితులకు అలవాటు పడతాం’ అని రాహుల్ చెప్పాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్లు కీలకం కానున్నారు. భారత పిచ్‌లపై స్పిన్నర్లకు టర్న్ ఎంతలా లభిస్తుందో చెప్పలేమని, అందుకని నెట్ ప్రాక్టీస్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాంమని రాహుల్ వెల్లడించాడు.
అంతేకాదు.. ‘ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌లో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. కుడి చేతివాటం, ఎడమ చేతివాటం బ్యాటర్ల జోడీ బౌలర్లను ఇబ్బంది పెడతారు. అయితే.. అవ్విన్, సిరాజ్, జడేజా వాళ్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నార’ని రాహుల్ అన్నాడు. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో మొదటి టెస్టు జరగనుంది.
గతంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2017లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అర్థ సెంచరీతో జట్టును గెలిపించాడు. సిరీస్ డిసైడర్ అయిన ఆ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో రాహుల్ ఫిఫ్టీతో జట్టును ఆదుకున్నాడు. దాంతో, భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.