KL Rahul : భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) నమ్మదగిన బ్యాటర్ మాత్రమే కాదు ఆపద్భాందవుడు కూడా. రోహిత్ శర్మ (Rohit Sharma) వీడ్కోలు తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్ అవతారం ఎత్తిన అతడు తండ్రి అయ్యాక మరింత చెలరేగిపోతున్నాడు. పాప పుట్టిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్న రాహుల్.. ఇప్పుడు వెస్టిండీస్‌పైనా రెచ్చిపోయాడు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన ఈ డాషింగ్ బ్యాటర్.. వెరైటీగా సంబురాలు చేసుకున్నాడు. కుడిచేత్తో బ్యాట్ పైకెత్తి చూపుతూ.. ఎడమ చేతి రెండు వేళ్లతో జోష్‌గా విజిల్ వేస్తూ సెంచరీని ఆస్వాదించాడు. ఈ స్పెషల్ సెలబ్రేషన్‌కు కారణం ఏంటో తెలుసా..?
అహ్మదాబాద్ టెస్టులో కేఎల్ రాహుల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీ కొట్టాడు. విండీస్ బౌలర్లను విసిగిస్తూ స్కోర్ బోర్డును నడిపించిన రాహుల్.. టెస్టుల్లో 11వ సెంచరీతో చెలరేగాడు. వందకు చేరుకోగానే అతడు తన సహజ స్టయిల్లో కాకుండా.. విజిల్ వేస్తూ సంబురాలు చేసుకున్నాడు. ‘ఎంటీ స్పెషల్?’ అని అడుగగా.. తన శతకాన్ని కూతురు ‘ఎవరాహ్’ (Evaarah)కు అంకితం చేశానని చెప్పాడీ ఓపెనర్. ప్రస్తుతం అతడి సెలబ్రేషన్ వీడియో నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ నటి అథియా శెట్టి(Athiya Shetty)ని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు రాహుల్. ఈ జంటకు ఈ ఏడాది మార్చి 24న పాపాయి జన్మించింది. తమ గారాలపట్టికి ‘దేవుడి కానుక’ అనే అర్ధం వచ్చేలా ఎవరాహ్ అని పేరు పెట్టింది స్టార్ కపుల్.
📸📸
A special knock calls for a special celebration 😍
Describe KL Rahul’s knock so far 👇
Updates ▶ https://t.co/MNXdZcelkD#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @klrahul pic.twitter.com/yX2OK3TVno
— BCCI (@BCCI) October 3, 2025
‘నా బ్యాటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నా. విభిన్న పరిస్థితుల్లో ఆడడం కొంచెం సవాలే. ఇంగ్లండ్ పర్యటన చాలా సరదాగా గడిచింది. అక్కడ పరుగులు సాధించడం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అహ్మదాబాద్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఏపై సెంచరీ బాదడం నాకెంతో ఉపయోగపడింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తర్వాత స్వదేశంలో ఆడడం.. చాలా సంతోషంగా ఉంది. స్వదేశంలో సాధించిన ఈ శతకాన్ని నా కూతురికి అంకితం ఇవ్వాలనుకున్నా. అందుకే.. విజిల్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నా’ అని చెబుతున్న రాహుల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో ఇప్పటివరకూ ఆరు టెస్టుల్లో 632 రన్స్ చేశాడు.
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టీమిండియా.. ముగ్గురు శతకాలతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(100), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(125), రవీంద్ర జడేజా (104 నాటౌట్) విండీస్ బౌలర్లను ఊచకోతకోస్తూ సెంచరీలు బాదారు. అనుభవం లేని కరీబియన్ బౌలింగ్ దళానికి చుక్కలు చూపించిన జురెల్, జడ్డూ.. జట్టు స్కోర్ 400 దాటించారు. జురెల్ ఔటైనా వాషింగ్టస్ సుందర్(9 నాటౌట్) క్రీజులో కుదురుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. ప్రస్తుతానికి గిల్ సేన 286 పరుగుల ఆధిక్యంలో ఉంది.
That’s Stumps on Day 2!
1⃣0⃣0⃣s from KL Rahul, Dhruv Jurel, and Ravindra Jadeja ✅#TeamIndia with a massive lead of 286 runs 💪
Scorecard ▶️ https://t.co/MNXdZceTab#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/cyPiBC6V4I
— BCCI (@BCCI) October 3, 2025