పెర్త్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు ముందు గాయాలబెడదతో సతమతమవుతున్న భారత జట్టుకు శుభవార్త. మూడురోజుల క్రితం గాయంతో ఇబ్బందిపడ్డ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆదివారం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. పెర్త్ టెస్టు లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
ఇక రెండోసారి తండ్రి అయిన సారథి రోహిత్ శర్మ మరికొన్ని రోజులు ఇక్కడే ఉండనున్న నేపథ్యంలో పెర్త్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత్‌ను నడిపించనున్నట్టు సమాచారం. మరోవైపు యువ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డికి మొదటి టెస్టులో చోటు దక్కొచ్చన్న వార్తలూ వినిపిస్తున్నాయి.