KL Rahul : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) ఐపీఎల్లో మరో ఘనత సాధించాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) రికార్డు బద్ధలు కొట్టాడు. ఐపీఎల్లో వేగంగా 4 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. అతను 105 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. గేల్ మాత్రం 112 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల రన్స్ స్కోర్ చేశాడు.
అంతేకాదు 2018 నుంచి ఇప్పటివరకు ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టింది అతనే. రాహుల్ ఖాతాలో 32 అర్థ శతకాలు ఉన్నాయి. శిఖర్ ధావన్(Shikhar Dhawan), డేవిడ్ వార్నర్(David Warner) 23 ఫిఫ్టీలతో రెండో స్థానంలో ఉన్నారు.
🚨 Milestone 🚨
4⃣0⃣0⃣0⃣ runs and counting for @klrahul in #TATAIPL 👏👏
Follow the match ▶️ https://t.co/OHcd6Vf5zU #LSGvPBKS pic.twitter.com/NWXTyJbLm0
— IndianPremierLeague (@IPL) April 15, 2023
స్వదేశంలో శ్రీలంక సిరీస్‌లో అదరగొట్టిన రాహుల్ బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో విఫలమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో పేలవ ఫామ్‌తో విమర్శల పాలయ్యాడు. దాంతో, టీమ్ మేనేజ్మెంట్ అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని ప్లేస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆడించింది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మూడు మ్యాచుల్లో రాహుల్ నిరాశ పరిచాడు.