సిడ్నీ: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా నెమ్మదిగా ఆడుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే వెనుదిరిగాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 32 రన్స్ చేసింది.