IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ వేలానికి సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31లోపు అట్టిపెట్టుకుంటున్న ఆరుగురి పేర్లను ఫ్రాంచైజీలు బీసీసీఐకి చెప్పాల్సి ఉంటుంది. పైగా ఈసారి స్క్వాడ్‌లో సమూల మార్పులు చేసేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. అందువల్ల పలువురు కీలక ఆటగాళ్లు వేలంలోకి వచ్చే అవకాశముంది. అందులో కేఎల్ రాహుల్ (KL Rahul) ఉంటాడనే వార్తలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. రెండు సీజన్లుగా లక్నోసూపర్ జెయింట్స్(Luckonw Super Giants)కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ఈసారి ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నాడట. తనను వచ్చే సీజన్‌కు అట్టిపెట్టుకోవద్దని యజయాన్యానికి చెప్పేశాడట.
ఐపీఎల్ 2022 ఎడిషన్ ముందు లక్నో రూ.17 కోట్లతో రాహుల్‌ను సొంతం చేసుకుంది. అప్పటికే టీమిండియా తరఫున ఇరగదీస్తున్న అతడికి కెప్టెన్సీ అప్పగించింది. అంచనాలకు తగ్గట్టే రాహుల్ 612 పరుగులతో మెరవడమే కాకుండా జట్టును ప్లే ఆఫ్స్ చేర్చాడు. అయితే.. 2023 ఎడిషన్‌లో రాహుల్ టోర్నీ మధ్యలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు.
Sanjeev Goenka, Justin & Zaheer Khan had series of talks with KL Rahul and he was told that the management isn’t satisfied with his way of leading LSG.
Management wishes that he continues to play for LSG but as a match winner keeping aside his leadership aspirations! pic.twitter.com/57BEIPgYDd
— Hustler (@HustlerCSK) October 22, 2024
ఇక 17వ సీజన్లో రాహుల్ కెప్టెన్‌గా తిరిగొచ్చినా మునపటిలా ఆడలేకపోయాడు. పైగా సారథిగా అతడి నిర్ణయాలు కూడా బెడిసికొట్టాయి. దాంతో, లక్నో యజమాని సంజీవ్ గొయెంకా (Sanjeev Goenka) అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదని.. రాహుల్‌పై వేటు తప్పదని వార్తలు తెగ వ్యాపించాయి. అయితే.. గొయెంకా అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొంటూ రాహుల్‌ను తన ఇంటికి స్వయంగా ఆహ్వానించాడు. ఇక వివాదం ముగిసింది అనుకున్నారంతా. కానీ, రాహుల్ మాత్రం తనను అవమానించిన చోట కొనసాగొద్దని అనుకున్నాడేమో.
🚨Breaking🚨
After 3 hours of meeting between KL Rahul and LSG owner
The LSG owner have successfully convinced KL Rahul to stay away from the team. pic.twitter.com/02y9nDhO1T— mufaddla parody (@mufaddl_parody) October 23, 2024
ఈమధ్యే జరిగిన టీమ్ మీటింగ్‌లో ‘ఇక లక్నోకు ఆడలేన’ని గొయెంకాతో చెప్పాడట. అయితే.. ఈ విషయంపై రాహుల్ లేదా లక్నో ఫ్రాంచైజీ యజమాని గొయెంకా త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. రాహుల్ లక్నోను వీడడం నిజమైతే.. వేలంలో అతడిని కొనేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీ పడడం ఖాయం. ముఖ్యంగా ఆర్సీబీ రేసులో ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
The entire media has been fooled. Goenka did not invite KL Rahul for dinner party. Guess Rahul wore a T-shirt yesterday when he reached Lucknow in the beginning.👿#KLRahul #IPL2024 #Lsgvsdc #RCBvsCSK pic.twitter.com/ghp4hEm2xo
— Nitesh Sharma (@im_nitesh26) May 15, 2024