టీమిండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ దగ్గర క్రికెట్‌కు సంబంధించిన అన్ని షాట్లూ ఉన్నాయని, అతను కేవలం ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించడమే కాదు.. మరింత అద్భుతంగా ముగించగలడని కొనియాడాడు. కాబట్టి 15-16వ ఓవర్ వరకు రాహుల్ గనుక క్రీజులో ఉంటే. వాళ్ల జట్టు సులభంగా 200 పైచిలుకు స్కోరు చేయగలుగుతుందని అభిప్రాయపడ్డాడు.
కాగా, ఈ సీజన్లో కొత్తగా ఐపీఎల్లో కలిసిన లక్నో జట్టు తొలి మ్యాచ్‌లో మరో కొత్త జట్టు గుజరాత్ చేతిలో ఓటమి చవి చూసింది. అయితే ఆ తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌పై 210 పరుగుల భారీ స్కోరును ఛేదించి అద్భుతమైన విజయం నమోదు చేసింది. సోమవారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధం అవుతోంది.